Friday, March 29, 2024

పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….

- Advertisement -
- Advertisement -

shot

 

భోపాల్: లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కానిస్టేబుల్ చేతన సింగ్ (40) రెండు నెలల క్రితం విధుల్లో చేరాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో పని ఒత్తిడి పెరగడంతో బాగా అలసిపోయేవాడు. కరోనా సోకుతుందని ప్రాణ భయం పట్టుకుంది. విధులు నిర్వహిస్తున్న సమయంలో రివ్వాలర్‌తో రెండు సార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఎడమ చేతిపై కాల్చుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. భోపాల్‌లో పది మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. మధ్య ప్రదేశ్‌లో కరోనా రోగుల సంఖ్య 741కు చేరుకోగా 53 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 11,530 మందికి సోకగా 394 మంది చనిపోయారు.

 

Constable shoots at self on duty in Madhya Pradesh
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News