Home కెరీర్ దళారులను నమ్మొద్దు

దళారులను నమ్మొద్దు

 Constable SI total 18 428 police jobs notification

కానిస్టేబుల్, ఎస్‌ఐ మొత్తం 18,428 పోలీసు ఉద్యోగాల కోసం విడుదలైన నోటిఫికేషన్‌లపై జూన్ 9 నుంచి 30వ తేదీ వరకు www.tslprb.in ద్వారా ఎస్‌ఐ సివిల్ పోస్టు కోసం 1,88,715 దరఖాస్తులు, ఎస్‌ఐ (ఐటి) పోస్టు కోసం 13,944, ఫింగర్ ప్రింట్ ఎఎస్‌ఐ పోస్టు కోసం 7,700, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 4,79,166 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు. సివిల్ పోస్టుల్లో మహిళలకు మూడో వంతు పోస్టులు రిజర్వ్ చేశారు. అలాగే ఎఆర్ పోస్టుల్లోనూ 10 శాతం సీట్లు కేటాయించామన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుందన్నారు. ప్రాథమిక రాత పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తామని, ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి తుది రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియలన్ని కూడా అత్యంత శాస్త్రీయ పద్ధ్దతిలో జరుగుతాయన్నారు. ప్రతి అభ్యర్థి ఈవెంట్స్‌లన్నీ కూడా వీడియో రికార్డుల ద్వారా పారదర్శకంగా జరుగుతాయన్నారు.
ఎంపిక విధానం ఇలా…
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట ప్రాథమిక రాత పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, రిజనింగ్/మెంటల్ ఎబిలిటి, తెలంగాణ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు పొందితే పిఎంటి, పిఇటిలకు అనుమతిస్తారు. జనరల్ విద్యార్థులు 40%, బిసి 35%, ఎస్‌సిఎస్‌టి, ఎక్స్‌సర్సీమెన్ 30% మార్కులు విధిగా పొందాలి. ఇక పిఇటి దశ దాటిన వారికి ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులోనూ ఒక పేపర్, మూడు గంటల సమయం ఉంటుంది. ఫైనల్ రాత పరీక్షలో పొందవే మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. కానిస్టేబుల్ (సివిల్), జైళ్ల శాఖలో వార్డన్, ఫైర్‌మెన్ పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకు ఈవెంట్స్‌కు వెయిజి ఇస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులను ఈవెంట్స్‌లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
ప్రిలిమ్స్, ఫైనల్ పరీక్షల సిలబస్…
ఈ రెండు పరీక్షలకు దాదాపు సిలబస్ ఒకటే. ఫైనల్ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్‌లో అదనంగా పర్సనాలిటీ టెస్ట్ సిలబస్‌ను చేర్చారు. అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరీక్షించే విధంగా ఎథిక్స్, జండర్ సెన్సిటివిటి, వీకర్ సెక్షన్, సోషల్ అవేర్‌నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇది తప్ప మిగతా సిలబస్ అంతా ప్రిలిమ్స్, ఫైనల్ పరీక్షలకు ఒకటే.
-అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటిలో..నంబర్ సిస్టమ్, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, నిష్పత్తులు, సగటు, శాతాలు, లాభ నష్టాలు, సమయం-పని, పని- వేతనాలు, కాలం-దూరం, గడియారాలు-కాలెండర్లు, భాగస్వామ్యం, బీజగణితం నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌లో వెర్బల్, నాన్ వెర్బల్‌పై ప్రశ్నలు ఉంటాయి. అనాలజిస్, సిమిలారిటీస్-డిఫరెన్స్‌స్, స్పేడియల్ విజులైజేషన్, స్పెషియల్ ఒరియెంషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొదీపై ప్రశ్నలు అడుగుతారు.
-జనరల్ స్టడీస్ పేపర్‌లో… జనరల్ సైన్స్, కరెంట్ ఆఫైర్స్, భాతర దేశ చరిత్ర, భారత భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ, ఎకానమీలతో ఆపటు 1948 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంపై ప్రశ్నలడుగుతారు. ఫైనల్ పరీక్షలో వీటితో పాటు అభ్యర్థి పర్సనాలిటీ పరీక్షించే విధంగా ఎథిక్స్, జండర్ సెన్సిటివిటి, వీకర్ సెక్షన్, సోషల్ అవేర్‌నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
-ఫైనల్ రాత పరీక్షలోని ఇంగ్లిష్, తెలుగు పేపర్‌లలో అభ్యర్థి భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలడుగుతారు. ఇవి కూడా పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. వ్యాకరణం, పదజాలం, కాంప్రహెన్షన్, భాషను ఎలా ఉపయోగించాలి తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో తెలుగు లేదా ఉర్దూను ఎంచుకోవచ్చు.
గమనిక: ఎఆర్, ఎస్‌ఎఆర్, సిపిఎల్, టిఎస్‌ఎస్‌పి, టిఎస్‌ఎస్‌పి 15వ బెటాలియన్ పోస్టులకు రాత పరీక్షలోని అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ పేపర్లల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులను 100కు కుదిస్తారు. అం..ఈ. రెండు పేపర్లల్లో వచ్చిన మార్కులను కలిపి మొత్తంగా 200 మార్కులను పరిగణించి..అంతిమంగా ఫైనల్ రాత పరీక్ష+పిఇటి (125మార్కులు)లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పిఇటి)…
(షాట్‌పుట్‌బాల్ బరువు పురుషులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 7.26 కిలోలు, మహిళలకు 4 కిలోలు)
ప్రాథమిక పరీక్షను దాటిన తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పిఎంటి) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పిఇటి) నిర్వహిస్తారు. అన్ని పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పిఇటి) : అన్ని నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి పిఎంటి దాటిన అభ్యర్థులు పిఇటికి హాజరుకావాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు సివిల్ ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు పట్టికలో పేర్కొన్న ఏవైనా రెండు ఈవెంట్స్‌ల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. మిగిలిన విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించాలంటే అన్ని ఈవెంట్స్‌ల్లో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి.- మహిళా అభ్యర్థులు సివిల్, అసిస్టెంట్ మాట్రన్ పోస్టులకు 100 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏదైనా ఒక ఈవెంట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఎఆర్ ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించాలంటే మూడు ఈవెంట్స్‌ల్లో ఉత్తీర్ణులవ్వాలి. పిఈటి దశ దాటిన వారికి ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కి మూడు గంటల సమయం ఉంటుంది.
ఈవెంట్స్ ఒక్కసారే : పలు శాఖల్లో ఎస్‌ఐ, అసిస్టెంట్ ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో), కానిస్టేబుల్..మొదలైన పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు..ప్రిలిమ్స్ దాటితే అన్ని పోస్టులకు వేర్వేరుగా ఈవెంట్స్‌కు హాజరయ్యే పరిస్థితి గతంలో ఉండేది. కానీ, ఈసారి అన్ని పోస్టులకు కలిపి ఒకే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
నెగిటివ్ మార్కులున్నాయి జాగ్రత్త…
ఫైనల్ రిటన్ టెస్ట్‌లో భాగంగా నిర్వహించే మొదటి రెండు పేపర్లు..పేపర్1,2లు ఇంగ్లిష్, తెలుగు/ఉర్దులను గతంలో డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించేవారు. వాటి స్థానంలో ఈసారి అబ్జెక్టివ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండు పేపర్లలో అర్హత సాధించడం తప్పనిసరి. లేకపోతే అభ్యర్థులను తుది జాబితా ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. పైగా, ఈ రెండు పేపర్లలో మొదటిసారిగా నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి తప్పు సమాధానానికి వాటికి కేటాయించిన మార్కుల్లో 25 శాతం కోత విధిస్తారు. అర్థమెటిక్ ండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటి, జనరల్ స్టడీస్ పేపర్లు పూర్తిగా అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటిల్లోనూ కనీస మార్కులు సాధించాలి. ఒసిలు కనీసం 40 శాతం, బిసిలు 35 శాతం, ఎస్‌సిఎస్‌టి ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు.