Home జాతీయ వార్తలు వైరల్ గా మారిన కానిస్టేబుల్ పాట (వీడియో)

వైరల్ గా మారిన కానిస్టేబుల్ పాట (వీడియో)

Constable

 

ఛండీగఢ్: పంజాబ్‌లోని ఓ కానిస్టేబుల్ ట్రాఫిక్ రూల్స్‌పై పాడిన పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫేమస్ సింగర్ డేలర్ మెహండీ పాడిన పాటను ఆ కానిస్టేబుల్ పాడాడు. బోలో తారా రారారా అనే పాటను రోడ్డుపై నిల్చొని పాడాడు. మ్యూజిక్‌కు తగినట్టుగా పాట పాడుతూ నో పార్కింగ్‌పై అవగాహన కల్పించాడు. తాను పాట పడినందుకు డేలర్ మెహండీ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అభినందనలతో పాటు ఆ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నాడు. ఈ వీడియో య్యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాటతో హైలెట్‌గా ట్రాఫిక్ అవగాహన కల్పిస్తున్న ఆ కానిస్టుబుల్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొత్త పద్దతిలో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించాడని రోహిత్ కుమార్ అనే నెటిజన్ కామెంట్‌ పెట్టాడు. పాట బాగా పాడాడని పియుష్ కుమార్ పాల్ మెచ్చుకున్నాడు. ఉద్యోగంలో కొత్తదనం చూపించాడని భక్త బత్సాల్ అనే వ్యక్తి కొనియాడారు. ఈ పాటను యూట్యూబ్ లో 30 వేల మంది వీక్షించారు.