Home తాజా వార్తలు జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం…

జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం…

Canistable-atemt-suside

హైదరాబాద్: ఓ కానిస్టేబుల్ ఎకె-47 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ప్రశసన్‌నగర్‌లో గల రిటైర్డ్ డిజి ఆర్పీ మీనా ఇంటి దగ్గర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిశోర్ తుపాకితో కాల్పుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతని చాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు ఆరా తీస్తున్నారు.