Wednesday, April 24, 2024

బైక్‌పై నుంచి కింద పడ్డ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

Constable who fell down from bike

తలకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చికిత్స

మనతెలంగాణ, హైదరాబాద్ : మోటార్ సైకిల్‌పై నుంచి కిందపడడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయిన సంఘటన నగరంలోని అమీర్‌పేటలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వేణుబాబు నగరంలోని వెంకటగిరిలో కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. వేణుబాబుకు మూర్చ వ్యాధి ఉంది. ఈ క్రమంలోనే బైక్‌పై విధులకు హాజరయ్యేందుకు మద్యాహ్నం వెళ్తుండగా అమీర్‌పేటలోని సోనాబాయి టెంపుల్ మేయిన్ రోడ్డు వద్దకు రాగానే మూర్చ వచ్చింది. దీంతో ఒక్కసారిగి బైక్‌పై నుంచి రోడ్డు మీదపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News