Thursday, April 25, 2024

షీటీమ్స్‌తో నిరంతరం నిఘా

- Advertisement -
- Advertisement -
సిద్దిపేట జిల్లాలో షీటిమ్స్‌తో మహిళలకు, బాలికలకు భరోసా
నవంబర్ నెలలో నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లాలో షీటిమ్స్‌తో మహిళలకు, బాలికలకు భరోసా కల్పిస్తున్నామని సీపీ శ్వేత అన్నారు. గురువారం నవంబర్ నెలలో నిర్వహించిన ఆవేర్నెస్ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ మహిళలు, బాలికల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. మహిళల, బాలబాలికల విద్యార్ధిని, విద్యార్ధులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఏదైనా పోన్ వస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు.

గుర్తించిన హాట్పాట్ వద్ద మరింత నిఘా ఉంచామన్నారు. హాట్సాట్ వద్ద మరింత నిఘా ఉంచామన్నారు. సిద్దిపేట డివిజన్ షీటిమ్స్ 12 హాట్సాపట్, 237 సార్లు సందర్శించారు. 29 ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధిని, విద్యార్ధులు, బస్టాండ్, మార్కెట్లలో సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. గజ్వేల్ డివిజన్‌లో 10 హాట్సాట్ 225 సార్లు సందర్శించారు. 26 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్ధులకు బస్టాండ్, మార్కెట్లలో సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. అలాగే హుస్నాబాద్ డివిజన్‌లో 10 హాట్సాట్ 221 సార్లు సందర్శించారు.

27 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్ధులకు బస్టాండ్, మార్కెట్లలో సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించామన్నారు. మహిళలు అత్యవసర పరిస్ధితుల్లో డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. ఎవరైనా వేదించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబబించిన వెంటనే 100 లేదా షి టీమ్ వాట్సప్ నెంబర్ 9701640473, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 పోన్ చేయాలన్నారు. చదువుకునే విద్యార్ధినీలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహాం చేస్తున్నట్లుగానే తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్‌ను సిద్దిపేట కమిషనరేట్‌లో ప్రారంభించడం జరిగింది.

మనుషులు అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు. తరుచుగా కిడ్నాప్ తదితర ఆర్గనైజ్డ్ నేరాలు చేసే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు.మహిళా పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఎబి.దుర్గా ఆద్వర్యంలో షీటిమ్స్ బృందాలు పని చేయడం జరుగుతుందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ సాంబయ్య, ఎస్‌ఐ , షీటిమ్ సిబ్బంది మహమ్మద్ ముజిబ్‌హైమ్, ఎఎస్‌ఐ అమృత్, ఎఎస్‌ఐ మల్లేశం, ఎఎస్‌ఐ హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, మహిళా కానిస్టేబుళ్లు పద్మ, సంగిత, జ్యోతి, రజిత, కానిస్టేబుళ్లు స్వామి, ప్రకాశ్, రవి, యుగేందర్, అన్వేష్, దుద్యానాయక్, షీటిమ్స్ డివిజన్ వారిగా విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News