*రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్
*రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
మన తెలంగాణ/జమ్మికుంట రూరల్ ః మండలంలోని కోరపల్లి గ్రామంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తా లో రహదారుల పనుల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర రోడు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు లు భూమి పూజ చేశారు. అంతకుముందు కోరపెల్లి గ్రామ హైస్కూల్ నుండి ఏర్పాటు చేసిన హిరంగ సభ వరకు భారీ ర్యాలీతో డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణ పనులకు 153 కోట్ల రూపాయలతో కోరపెల్లి నుండి బిజిగిరిషరీఫ్,నాగంపేట మీదుగా వరకు అలాగే కోరపెల్లి నుండి రెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్ల నిర్మాణానికి కరోపల్లి నుండి జమ్మికుంట వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. గతంలో ఎస్సారెస్పీ లోనీళ్లు ఉన్నప్పటికి ఎల్‌ఎంటి కి నీటిని వదిలేవారు కాదని సీఎం కెసీఆర్ చొరవతో కరీంనగర్ కు వేసవికాలం పంటకు నీటిని ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసం లో చివరి ఆయకట్టు పొలాలకు కూడా నీటిని అందిస్తామన్నారు.రైతుకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఋణం తీర్చుకోవాలిసన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోడ్ల నిర్మాణానికి పెట్టిన ఫైళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తిరస్కరించలేదని ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ మాట్లాడుతూ ఈటలరాజేందర్ అందరిని సమానంగా చూస్తారని అందుకు ఆర్థికశాఖను అప్పజెప్పడం జరిగిందన్నారు. మంత్రి కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం ప్రజల అభివృద్ది కొరకు పాటుపాడాలని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుండి ఎంపి వినోద్‌కుమార్ తీసుకువస్తున్నాడని ఆయన తెలిపారు., ఎన్నికల ముందు వాగ్దానాలను తీరుస్తున్నామని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సాధించేవరకు టిఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. సీఎం కెసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి దొరకడం మనఅందరి అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను తీర్చే వరకు ఈ యజ్ఞం కొనసాగుతుందన్నారు. రైతులు ,కార్మికులు, ప్రజల కొరకు నిరంతరం ఆలోచిస్తున్న మన మంత్రి ఈటెల అని అభిర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తొందరగా అనుమతులు రావడం అనేది గొప్ప విషయమని కరీంనగర్ ఎంపి బోయినపెల్లి వినోద్‌కుమార అన్నారు. ప్రతిరోజు ప్రాజెక్టుల బ్యారేజి కొరకు 6లక్షల సిమెంట్ బస్తాలను ఉపయోగిస్తున్నామని కోటి ఎకరాల నీరు అందించడమే ప్రభుత్వ లక్షమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందని గవర్నర్ అంటే దాన్ని రాజకీయం చేస్తూ తప్పుపడితే ఎలా ఆయన ప్రశ్నించారు .గ్రామ గ్రామానికి రోడ్లు, దావఖానాలు నిర్మించబోతున్నామని అలాగే విద్య,వైధ్యానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు.
24గంటల విధ్యుత్‌ను ఇస్తున్న ఘనత టిఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. పరిశ్రమలు పునరుద్దరించడమే కాకుండా కొత్త పరిశ్రమలను నెలకొల్పుతున్నామని టిఆర్‌ఎస్ అభివృద్దిని చూసి కాంగ్రెస్ విమర్శిస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతం మట్లాడుతూ ప్రజల అభివృద్ది సంక్షేమం కొరకే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చుకొని ఎక్కడ లేని విధంగా ఈటెల అభివృద్ది చేస్తున్నాడని పెద్దపెల్లి ఎంపి బాల్కసుమన్ అన్నారు.