Home తాజా వార్తలు అద్దాల్లా పల్లె రోడ్లు..

అద్దాల్లా పల్లె రోడ్లు..

Roads

2వేల కోట్లతో బిటి రోడ్ల నిర్మాణ పనులు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామాల్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు ఇక అద్దంలా మెరవనున్నాయి. ప్రయాణానికి ఏ మాత్రం సౌకర్యంగా లేని రహదారుల స్వరూపం పూర్తిగా మారనుంది. పూర్తిగా పాడైన రోడ్ల స్థానంలో బిటి రోడ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీ శాఖ అధికారులు త గు ప్రణాళికలను రూపొందించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 2724 కిలోమీటర్ల మేర కొ త్త రహదారులను మంజూరు చేసింది. సుమారు రూ.2 వేల కోట్లతో ఈ పనులను ఈ పనులపై కేం ద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టనున్నా యి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పంచాయతీల్లోని గ్రామాలకు రహదారుల కళ రానుంది. రా ష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా వాటిల్లో ఎన్ని గ్రామాల్లో పూర్తి అధ్వాన్నంగా మా రిన రోడ్లు ఎన్ని? పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లు ఎంత మేరకు ఉన్నాయి? కొత్తగా ఎన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది? ఎన్ని పంచాయతీల్లో యుద్దప్రాతిపదికన రహదారుల నిర్మాణలను చేపట్టాలి? తదితర అంశాల వారీగా అధికారులు కసరత్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా రోడ్ల నిర్మాణాలను చేపట్టడం వల్ల గ్రామాల్లో ప్రస్తుతం అధ్వానంగా కనిపించే ఇరుకు రోడ్లు, గుంతలమయంగా కనిపించే రహదారులు పూర్తిగా కనుమరుగు కానున్నాయి.

కేవలం రహదారుల నిర్మాణం చేపట్టడమే కాకుండా వాటి నిర్వహణ విషయంలోనూ పూర్తి స్థాయిలోనూ పంచాయతీ శాఖ అధికారులు దృష్టి పెట్టనున్నారు. గ్రామాల్లోని రహదారులు అద్దంలా మెరవడంతో పాటు రోడ్లపై ఎక్కడా చెత్తకుప్పులు, మట్టికుప్పలు లేకుండా చూడాలని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పనుల తరువాత రహదారుల నిర్మాణానికే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో మెరుగైన రవాణా కోసం ఎన్ని నిధులనైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దం గా ఉందని పలుమార్లు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సిఎం ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో అత్యవసరమైన రహదారుల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అయితే కేంద్రం తాజాగా పిఎంజిఎస్‌వై కింద కొత్తగా 2724 కిలో మీటర్ల రహదారులను మంజూరు చేసిన నేపథ్యంలో పంచాయతీల్లో రోడ్ల నిర్మాణ పనులు మరింత ముమ్మరంగా సాగనున్నాయి. ఈ రోడ్ల నిర్మాణాలతో పాటు గ్రామాల్లో చిన్న చిన్న వంతెనలకు కూడా మరమ్మత్తులు చేపట్టనున్నారు.

ఒకవైపు రహదారులు, మరోవైపు రోడ్లుకు ఇరవైపులా పెద్దఎత్తన మొక్కలను పెంచే కార్యక్రమాన్ని కూడా అధికారులు చేపట్టనున్నారు. రాష్ట్రానికి పచ్చదనం అందాలు కనిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం కింద పెద్దఎత్తున మొక్కలను పెంచడం, పార్కుల నిర్మాణానికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో కూడా మొక్కలను పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని కెసిఆర్ ఆదేశించారు. దీంతో ఇప్పటికే పలు గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. దీంతో త్వరలోనే గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయి పచ్చదనంతో శోభయమానంగా మారడం తథ్యంగా కనిపిస్తోంది.

Construction work of BT roads with 2 thousand Crores