Thursday, March 28, 2024

హీరో సూర్యపై కోర్టు ధిక్కరణ ఫిర్యాదు….

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో నీట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులలో కరోనా భయం, పరీక్షల ఒత్తిడి కారణంగా ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలపై టాలీవుడ్ హీరో సూర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తున్న గౌరవ న్యాయమూర్తులూ… విద్యార్థులు మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమని తీవ్ర స్థాయిలో సూర్య ధ్వజమెత్తారు. దేశంలో న్యాయమూర్తులను, న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన హీరో సూర్యపై కోర్ట ధిక్కరణకు పాల్పడ్డారంటూ చెన్నై హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎం సుబ్రమణ్యం అనే న్యాయమూర్తి సూర్యపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News