Home జిల్లాలు అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి

అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి

waragalతొర్రూరు : తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల ఆశయాలను కొనసాగించాలని అమ్మాపురం గ్రామ సర్పంచ్ మామిండ్లపెల్లి రమేష్ అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని అమ్మాపురం గ్రామంలో సాయుద పోరాట అమర వీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొత్తూరి నర్సయ్య, పబ్బోజు వెంకటలక్ష్మి, గూడెల్లి ఎల్లమ్మ, బొల్లం ముత్తమ్మ, డొనుక వెంకటమ్మ, గుంటుక లచ్చమ్మ, జనగం లక్ష్మి, కిన్నెర సరోజనలను గ్రామ సర్పంచ్ రమేష్, ఎంపిటిసిలు యాకలక్ష్మి, సుగుణమ్మ, వార్డు సభ్యులు, మాజి సర్పంచ్ తమ్మెర విశ్వేశ్వర్‌రావులు సన్మానించారు. ఈకార్యక్రమంలో తమ్మెర వీరబ్రదారావు, తీగల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ గందం బంగారమ్మ, మహేష్, అంగన్‌వాడీలు, సాక్షరభారతి, ఈజిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.