Home నల్లగొండ అవుట్ సోర్సింగ్ ఎజెన్సీల మాయాజాలం

అవుట్ సోర్సింగ్ ఎజెన్సీల మాయాజాలం

కాంట్రాక్టు కార్మికుల పొట్టగొడుతున్న ఎజెన్సీలు
ఇపిఎఫ్, ఇఎస్‌ఐలకు ఎగనామం
పట్టించుకోని అధికారులు

Outsourcing1

నల్లగొండ ప్రతినిధి: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీన్సీలు కాంట్రాక్టు ఉద్యోగుల పొట్ట గొడుతున్నాయి.  ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్, ఎంప్లాయి స్టేట్ ఇన్యురెన్సులను ఉద్యోగుల ఖాత ల్లో జమ చేయకుండా మాయం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 135 రిజిష్టర్ అవుట్ సోర్సింగ్ ఏజన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 800 నుండి 1000 వరకు  అవసరమైన కాంట్రాక్టు ఉద్యొగులను అధికారులు ఎంపిక చేస్తారు. రూ. 10 వేల జీతం పొందే కాంట్రాక్ట్ ఉద్యొగిపై 200 వరకు ఏజెన్సీ లకు కమిషన్ వస్తుంది.

కాగా ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) క్రింద ఉద్యోగి జీతంలోంచి 12 శాతం వరకు వసూలు చేస్తారు. దీనికి అదనంగా ప్రభుత్వం 13.36 శాతం నిధులను కలుపుతుంది. ఇఎస్‌ఐ క్రింది ఉద్యోగి జీతం 1.75 శాతం వసూ లు చేసి ప్రభుత్వం 4.75  శాతం కలిపి ఏజెన్సీలకు ఇస్తుంది. ఏజెన్సీలు ఉద్యొగి ఇపిఎఫ్, ఇఎస్‌ఐ నెంబర్ ఇచ్చి ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ ఉద్యొగి  పేరున ఖాతాలో జమచేయాల్సి ఉంది కానీ ఏజెన్సీల మాయజాలంతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో అనేక మంది ఇపిఎఫ్, ఇఎస్‌ఐ వసతులు కోల్పో తున్నారు. కాంట్రాక్టు ఉద్యొగంల్లో 10 సం॥ పనిచేసి ఈపిఎప్ జమచేసి ఉన్నట్లుఅయితే పదవి విరమణ తరువాత ఫించన్ సౌకర్యం కలుగు తుంది.

ఇఎస్‌ఐ వల్ల కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబ సభ్యులకు అత్యవసర వైద్య అవసరమైనప్పుడు రూ. 5 లక్షల వైద్య ఖర్చు వరకు ఉద్యోగి ఉచితంగా పొందవచ్చు. కాంట్రాక్టు ఉద్యోగి జీతం నుండి ఇపిఎఫ్, ఇఎస్‌ఐ పేర డబ్బుల్లో కోత వేస్తూ ప్రభుత్వం జమ చేసే రూపాయలను తీసుకుంటు ఏజన్సీలు కాంట్రాక్టు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ముఖ్యంగా మార్కెటింగ్, మెడికల్ అండ్ హెల్త్ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గట్టిగా అడుగుతే ఉద్యొగం పోతుందేమోనని భయంతో ప్రశ్నించడానికి సహాసించడం లేదు. ఉద్యొగుల ఇపిఎప్, ఇఎస్‌ఐల ఖాతాల్లోకి ఏజెన్సీలు డబ్బులు జమ చేస్తున్నారా, లేదా అనే అంశాన్ని పర్యవేక్షించాల్సిన ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లోపంతో ఏజెన్సీలు ఉద్యోగులను మోసం చేస్తున్నాయని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.