-ఒకరు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు
-తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు
మన తెలంగాణ/కోట్‌పల్లి: అదుపుతప్పి కారు బోల్తా కొట్టి ఒక వ్యక్తి మృతి చెందిన సఘటన సోమవారం కోట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైద్రాబాద్‌లోని టోలిచౌక్ నుండి కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు హుండాయ్ ఐ10 కారు నంబరు ఎపి 13 ఎబి 4600 గాల కారులో 5 మంది యువకులు, బైక్‌పై మరో ఇద్దరు స్నేహితులు బయలుదేరి కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో సరాదగా గడుపుదమని వచ్చిన వ్యక్తులు కోట్‌పల్లి అనుబంధ అన్నాసాగర్ గ్రామ సమీపం నందు మూలమలుపు వద్ద ఉన్న పత్తి పోలంలోకి అదుపుతప్పి కారు దూసుకుపోవడంతో కారులో ఉన్న మాగ్ మాలిక్ (22) మృతి మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సాహెబ్‌అన్సారీ, మెడిసిన్ మ్యానిపాక్సర్‌లో ప్రైవేటు ఉద్యోగి, షెక్ అన్సారీ, సాదిక్ ప్రైవేటు టీచర్ గా టోలిచౌక్ మిగత వారు కూడా హైద్రాబాద్‌కు చెందినవారని ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. మృతిని తండ్రి అబు బాకర్ కాలిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.