మహబూబాబాద్: నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులో రైతులతో అవగాహన సదస్సు జరిగింది. నియంత్రిత సాగు విధానం గురించి రైతులకు మంత్రి సత్యవతి రాథోడ్ వివరించారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ అమలు చేస్తున్నామని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెండు ప్రధాన కాలువలకు వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారి పేర్లు నామకరణం చేశామని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నామని ప్రశంసించారు.