Friday, April 19, 2024

జూన్‌లో సహకార ఎన్నికలు!

- Advertisement -
- Advertisement -

Cooperative elections

 

కొనసాగుతున్న కొత్త ప్యాక్స్‌ల ఏర్పాటు ప్రక్రియ
మొత్తం 1340 ప్యాక్స్‌లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం
మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు

హైదరాబాద్: వచ్చే జూన్‌లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో త్వరలో ముగియనున్న ఇంఛార్జీల పాలన మరో ఆరు నెలలు రాష్ట్ర ప్రభుత్వం పొడగించనుంది. 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇంఛార్జీల పాలనకు ప్రభుత్వం అనుమతించగా, ఈసారి ఐదోసారి అవుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మున్సిపల్ ఒక్కసారి కూడా సహకార ఎన్నికలు జరగలేదు. 2018 లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్యాక్స్‌లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఖచ్చితంగా రెండు ప్యాక్స్‌లు ఉండాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రక్రియలో సహకార శాఖ నిమగ్నమైంది.

Cooperative elections in June
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News