Sunday, July 21, 2024

మహిళా ఎస్‌ఐను కాల్చిచంపిన బ్యాచ్‌మేట్

- Advertisement -
- Advertisement -
Cop-killed
ప్రేమ పెళ్లి కాదందని హత్య, ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఢిల్లీలో మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రీతి అహ్లవత్ (26) హత్యకు గురైంది. తోటి పోలీసు అధికారి ఈ ఘాతుకానాకి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదందని, పెళ్లిని తిరస్కరించిందనే కోపంతో ఆమెను చంపేసి తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆమె రోహిణీ ప్రాంతంలో మెట్రోస్టేషన్ నుంచి ఇంటికి వెళ్లుతుండగా యువతిపై కాల్పులు జరిగాయి. ఢిల్లీలో శనివారం అసెంబ్లీ ఎన్నికలకు ముందురోజు రాత్రి ఈ ఘటన జరగడం కలకలం కల్గించింది. ఈ ప్రాంతంలో అమర్చి ఉన్న సిసిటీవీ కెమెరాల ఆధారంగా కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించారు.

ప్రీతితో పోలీసు అకాడమీలో కలిసి చదివి ఎస్‌ఐ అయిన దీపాంశు రాథి ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. బ్చాచ్‌మెట్‌గా ఉన్న దీపాంశు ఆ తరువాత హర్యానాలోని సోనిపట్‌లో చనిపోయి ఉండగా పోలీసులు గుర్తించారు. ప్రీతిని కాల్చి చంపిన తరువాత ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. సోనిపట్‌లోని ముర్తాల్‌లో ఆయన కారులో మృతదేహాన్ని గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎస్‌డి మిశ్రా చెప్పారు. ఢిల్లీలోని ప్రతాప్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రీతి అందంగా హీరోయిన్ మాదిరిగా ఉండటం, ఆమె స్వస్థలం కూడా సోనిపటే. ఈ యువతిని ప్రేమించిన ఎస్‌ఐ దీపాంశు పెళ్లి ప్రస్తావన తెచ్చినట్లు, దీనిని ఆమె తోసిపుచ్చిందని, దీనివల్లనే తోటి ఎస్‌ఐని కాల్చి చంపినట్లుగా అనుమానిస్తున్నారు.

Cop killed batchmate woman SI in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News