Home తాజా వార్తలు భూమధ్య రేఖకు దూరంగా పగడాల దిబ్బలు

భూమధ్య రేఖకు దూరంగా పగడాల దిబ్బలు

Coral-reefలండన్: భూమధ్యరేఖపై ఉన్న సముద్ర జలాల నుంచి పగడాల దిబ్బలు క్షీణిం చి మళ్లి సమశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో తిరి గి స్థావరమౌతున్నట్టు కొత్త పరిశోధన వెల్లడించింది. అత్యుష్ణ ప్రదేశాల్లోని నవ పగడాల దిబ్బలు గత నాలుగు దశాబ్దా ల్లో 85 శాతం క్షీణించాయి. ఇది భూమధ్యరేఖ ప్రాంతం నుంచి వెనక్కు మళ్లి, కొత్తగా సమశీతోష్ణస్థితి ప్రాంతాల్లో స్థావరమవుతుండడానికి సంకేతాలుగా పరిశోధకులు వివరిస్తున్నారు. శీతోష్ణస్థితిలో మార్పే దీనికి కారణమని, అలాగే ఇవి సముద్ర జీవులను కూడా తరలించుకుపోతున్నాయని ఓషన్‌సైన్సెస్ బిగెలోలేబొరేటరీ సీనియర్ రీసెర్చి సైంటిస్టు నికొలొప్రైస్ పేర్కొన్నారు. ఈపరిశోధనకు ఆయ న నాయకత్వం వహిస్తున్నారు.

ఫ్రెంచి పొలినేసియా ప్రాంతంలో పగడాల దిబ్బల (కోరల్ రీఫ్స్)పై నేషనల్ సైన్సు ఫౌండేషన్ చేపట్టిన అధ్యయనంలో ఇదో భాగం. 28ప్రదేశాల్లో ఈ పరిశోధన చేపట్టారు. అటువంటి ప్రదేశాల్లో ఇదొకటి. సముద్రాలు వేడెక్కినప్పుడు అతిశీతల ప్రాంతాలన్నీ భూమధ్యరేఖ ప్రాంతాలక న్నా పగడాల దిబ్బలకు అనుకూలమైనవిగా మారుతుంటాయి. ఇది కొత్త ప్రాంతాలకు పగడాల లార్వా మరలిపోడానికి దారి తీస్తుంది. అక్కడ స్థావరమై పెరుగుతుంటాయని పరిశోధకులు వివరించారు.

ఎక్కడ మొదట పుట్టాయో అక్కడ నుంచి అనుకూలమైన సముద్ర నేలపైకి లార్వా తరలిపోయినప్పుడు కొత్తగా పగడాల దిబ్బలు పెరుగుతుంటా యి. భూ మధ్య రేఖకు ఉత్తరాంశ, దక్షిణాంశ రేఖల ప్రాంతాలను 35 డిగ్రీల వరకు పరిశోధకులు పరీక్షించారు. అక్క డ నుంచి వేరే అనుకూల ప్రాంతాలకు పగడాల దిబ్బలు తరలిపోయాయని ధ్రువీకరించ గలిగారు. ఆరు దేశాలకు చెందిన 17 అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలో పాలుపంచుకుంది. 1974 వరకు సేకరించిన సమాచారం ఆధారం గా ఈ పరిశోధన సాగించింది. ఆశ్ర యం పొందనున్న పగడాల దిబ్బలు (కోరల్ రీఫ్స్) భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడు స్థావరం ఏర్పర్చుకోగలుగుతాయో సమీక్షించడమే ఈ పరిశోధన లక్ష్యం.

Coral Reefs in Florida
                                                                                                 సైన్స్ విభాగం