Home తాజా వార్తలు హైదరాబాద్‌లో కార్డన్‌సెర్చ్

హైదరాబాద్‌లో కార్డన్‌సెర్చ్

POLIC-CHECKSహైదరాబాద్ : మాదన్నపేట పిఎస్ పరిధిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెర్చ్‌లో ఇద్దరు ఎసిపిలు, పది మంది సిఐలు, 20 మంది ఎస్‌ఐలు సహా 250 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఆరుగురు రౌడీషీటర్లు, ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. 44 బైక్‌లు, మూడు ఆటోలు, రెండు కత్తులు, ఐదు తల్వార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.