Home సిద్దిపేట నాచారంలో కార్డెన్ సెర్చ్‌…

నాచారంలో కార్డెన్ సెర్చ్‌…

Corden Search In Nacharam In Siddipet District

గజ్వేల్: నేర రహిత గ్రామాలు చేయటంతో పాటు ప్రజలకు భద్రత కల్పించటంలో భాగంగా కార్డాన్ అండ్ సెర్చ్ పేరుతో మూకుమ్మడి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని సిద్దిపేట పోలీసు కమీషనర్ డి.జోయెల్ డేవిస్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని వర్గల్ మండలం నాచారం గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో వంద మంది పోలీసులతో కలిసి కార్డెన్  సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలతో పాటు 2ఆటోలు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 32 సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలతో గ్రామాల్లో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లవుతుందని, శాంతి భద్రతల పరిస్థితిపై కూడా తాము ఒక అంచనాకు రాగలుగుతామని ఆయన అన్నారు. గ్రామంలో , కాలనీలో ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే 100 కు లేదా సంబంధిత గ్రామ పోలీసు అధికారికి తెలియ చేయాలన్నారు. అపరిచితులకు ఇల్లు కిరాయకు ఇవ్వవద్దని ఆయన సూచించారు.తగిన పత్రాలను చూపితే తిరిగి వాహనాలను సంబంధిత యాజమానులకు అప్పగిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సు, వాహన ఆర్సీ కానీ లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలను ఎత్తుకు పోతున్న ముఠాలు, వ్యక్తులు వస్తున్నారని సామాజిక మాథ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులేనని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. కమీషనరేట్ పరిధిలో అన్ని పట్టణాలు, గ్రామాలలో బ్లూకోల్ట్ పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘాను ఉంచామన్నారు.రాత్రి వేళల్లో ప్రత్యేకంగా అన్ని గ్రామాలలో , పట్టణాలలో పోలీసు పెట్రోలింగ్ నిర్వహిప్తున్నామన్నారు. అధికంగా రద్దీగా ఉండే ప్రదేశాలైన లాడ్జిలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, బస్టాండ్లు ఇతర కీలక ప్రాంతాలలో సిసి కెమెరాల నిఘా నిరంతరం ఉండే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు ప్రధౠన కూడళ్ల వద్ద గ్రామ పోలీసు అధికారి, పోలీసు స్టేషన్ నెంబర్లు గోడలపై రాయించామన్నారు. సంబంధిత సర్పంచ్‌ల వద్ద కూడా పోలీసు అధికారుల నెంబర్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు భయాందోళన చెందకుండా నిర్భయంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమీషనరేట్ పరిధిలోని అదపపు డిసిపి నర్సింహారెడ్డి, గజ్వేల్ ఇంచార్జి ఎసిపి మహేందర్, గజ్వేల్ టౌన్, రూరల్ సిఐలు ప్రసాద్, శివలింగం, తొగుట సిఐ నిరంజన్, ట్రాఫిక్ సిఐ నర్సింహారావు, ఎస్సైలు ప్రసాద్, నర్సింలుతో పాటు వంద మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.