Home తాజా వార్తలు నిర్మల్‌లో కార్డన్ సర్చ్

నిర్మల్‌లో కార్డన్ సర్చ్

Cardin Search at Nirmal

నిర్మల్ : కుబీర్ మండలం పార్ది(బి) గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్‌పి శశిధర్ రాజు నేతృత్వంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో తనిఖీలు చేసి సరైన ధ్రువపత్రాలు లేని 80 బైక్‌లు, 24జీపులు, 5 ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న రూ.3 వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తుల సంచారంపై తమకు సమాచారం ఇవ్వాలని ఎస్‌పి శశిధర్‌రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

Cordon Search at Nirmal