Home తాజా వార్తలు కంచన్‌బాగ్‌లో కార్డన్ సెర్చ్

కంచన్‌బాగ్‌లో కార్డన్ సెర్చ్

police cordon search in medchal district

హైదరాబాద్: పాతబస్తీ కంచన్‌బాగ్‌లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. పత్రాల్లేని 56 బైక్‌లు, మూడు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 66 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అక్రమ జంతు మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మామిడికాయల గోడౌన్‌పై పోలీసులు దాడులు చేశారు. మామిడికాయలు పండేందుకు నిల్వ ఉన్న కార్బటరీ స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.