Home తాజా వార్తలు మోత్కూర్ లో కార్డెన్ సెర్చ్

మోత్కూర్ లో కార్డెన్ సెర్చ్

Cordon-Search

మోత్కుర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లోని గాంధీనగర్, అన్నెపువాడలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో డిసిపి, ఇద్దరు ఎసిపిలు, ఆరుగురు సిఐలు, 15 మంది ఎస్సైలు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.  కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 39 బైకులు, 5 ఆటోలు, 2 తుఫాన్ వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎలాంటి లెక్కా పత్రాలు లేని 50 వేల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని  పోలీసులు విచారిస్తున్నారు.