Home తాజా వార్తలు పెబ్బేరులో నిర్బంధ తనిఖీలు

పెబ్బేరులో నిర్బంధ తనిఖీలు

telangana-police

 

వనపర్తి: పెబ్బేరులో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 200 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.