Home తాజా వార్తలు శ్రీరాంపూర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

శ్రీరాంపూర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

Cordon Search in Srirampur

మంచిర్యాల : నన్పూర్ మండడలం శ్రీరాంపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మంచిర్యాల డిసిపి వేణుగోపాల్‌రావు నేతృత్వంలో పోలీసులు ఆర్‌కె కాలనీ, సుందరయ్యనగర్, భగత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 55 బైక్‌లు, 2కార్లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపరిచితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిసిపి వేణుగోపాల్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

Cordon Search in Srirampur