Home నిర్మల్ ప్రమాదకరంగా మూలమలుపులు

ప్రమాదకరంగా మూలమలుపులు

Road

ముథోల్ : మండలకేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాలకు వేళ్లే రోడ్డుకుమూలమలుపులు అతి ప్రమాదకరంగా మారాయి. సంబంధిత రోడ్డు భవనాల శాఖ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపో వడంతో తరుచు ఈ మూల మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్న అధి కారులు పట్టించుకోవడం లేదని మండలంలోని వివిధ గ్రామంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముథోల్, బాసర మండలంలోని కిర్గుల్ (బి), గన్నొర, ఆష్టా, విఠోలి, సరస్వతీ నగర్, ఎక్స్‌రోడ్డు , మండలకేంద్రంలోని నాయాబాదీ చౌరస్తా రోడ్లు బాగానే ఉన్నప్పటికి మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.

దీంతో నిత్యం రోడ్డుపై తిరుగుతున్నవాహనాల చోదకులు భయంతో జంకుతున్నారు. రాత్రి సమయాల్లో చీకటిగా ఉన్నప్పుడు రోడ్లపై ప్రయాణించడానికి వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ గ్రామానికి వచ్చే కొత్తవారు ప్రయాణంచేసినప్పుడు మూలమలుపుల వద్ద పలుసార్లు ప్రమాదాలకు గురైన సందరభాలు ఎన్నొ ఉన్నాయని ఆయా గ్రామాల వాసులు పేర్కొంటున్నారు. గత ఆరు రెండునెలల క్రితం విఠోలి గ్రామం వద్ద పోలీస్ వాహనం బోల్తా ప డడంతో సిబ్బందికి గాయాలయ్యాయి.

మూలములుపుల వద్ద అధికారులు వాహనచోదకులకు ఏర్పాడే విధంసూచిక బోర్డులు కనిపించడం లేదు. దీంతో ప్రయాణీకులకు ప్రాణసంకటంగా మారింది. సంబంధిత ప ంచాయతీ శాఖ , ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకొకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుతున్నాయని ప్రయాణీకులు ఆరొపిస్తున్నారు. ఈ రోడ్ల మార్గాన ప్రతి రోజు అధికారులు ,ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్నప్పటికి సూచిక బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడడంలేదు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి ఆయా గ్రామాల మూలమలుపుల వద్ద పెద్దపెద్ద చెట్లన తొలగించి పలువురు కోరుతున్నారు.

సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలి : దశరత్, (ముథోల్ )

మండలంలోని వివిధగ్రామాల్లో వేళ్లే రోడ్ల వద్ద ఉన్నమూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
రాత్రివేళల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులు స్పందించాలి : అన్నెల రాజేశ్వర్ ( బాసర)

సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలలో మూలమలుపుల వద్ద పెద్దపెద్ద స్పీడ్ బ్రేక్‌లను ఏర్పాటుచేయాలి . అలాగే రోడ్డుపైన ఫర్ లాంగ్ దూరంలో ఎర్రని స్టీకర్లను పేట్టి తెల్లసున్నాన్నివేయిస్తే ప్రయాణీకులు నెమ్మదిగా వెళ్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదాలను జరగకుండా ఉంటాయి.