Friday, April 19, 2024

హైదరాబాద్‌లో కరోనా బాబా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Corona baba arrested at Hafeezpet in Hyderabad

హైదరాబాద్: నగరంలోని హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలో కరోనా బాబా ప్రత్యక్షమయ్యాడు. మాయలు, మంత్రాలతో కరోనాను నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబాగా గుర్తించిన పోలీసులు హహీజ్ పేట్ హనీఫ్ కాలనీలోని కరోనాబాబా స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఒక్కో కరోనా రోగి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నాడు.

గత మార్చి నుంచి కరోనా బాబా దందాలు.. కరోనాబాబాకు అతీతమైన శక్తులు ఉన్నాయంటూ శిష్యులు ప్రచారం చేశారు. మాస్క్ పెట్టుకోనక్కర్లేదు. అపూర్వ శక్తులతో కరోనా బారి నుంచి కాపాడతనంటూ నమ్మబలికిన ఆయన జలుబు, దగ్గు ఉన్నా.. అది కరోనానే అంటూ అమాయకులైన జనాన్ని భయపెట్టి వేలాది రూపాయలు దండుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్టు పోలీసులుే గుర్తించారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రికి వెళ్లాలని అక్కడున్న జనాన్ని పోలీసులు పంపించారు. మోసాలకు పాల్పడే బురిడీ కరోనాబాబాను నమ్మొద్దoటున్న పోలీసులు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News