Saturday, April 20, 2024

రేపటినుంచి మరింత కఠినంగా లాక్ డౌన్: సిపి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నగరంలోనే మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్19) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నగర సిపి అంజనీ కుమార్ అన్నారు. హైదాబారాద్ లో ప్రస్తుతం 331 యాక్టీవ్ కరోనా పాజిటీవ్ కేసులున్నాయని తెలిపారు. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని, రేపటినుంచి వాహనాల తనిఖీ మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. లాక్ డౌన్ ను అతిక్రమించి బయటకు వస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. అత్యవసరమైతే పాసుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తే అందజేస్తున్నమాని.. వ్యక్తిగత అవసరాలకు పాసులను వాడుకుంటే రద్దు చేస్తామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆస్పత్రుల దగ్గర డ్యూటీ చేస్తున్న సిబ్బందికి పిపిఈ కిట్లు ఇస్తున్నామని, పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, బ్లీచింగ్ పౌడర్ అందించామని సిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు.

Corona cases highly Registered in Hyderabad: CP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News