Thursday, April 25, 2024

33 జిల్లాలపై వైరస్ దాడి..

- Advertisement -
- Advertisement -

 వారం రోజుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 4568 కేసులు
 రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, వరంగల్ అర్బన్‌లోనూ ఎక్కువే
 రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచన

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ 33 జిల్లాలపై దాడికి దిగింది. మార్చి 2 తేదిన అధికారికంగా తొలి కేసు నమోదైనప్పట్నుంచి వైద్యశాఖ అప్రమత్తమైంది. పటిష్ఠమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వైరస్ తీవ్రత అన్ని జిల్లాలకు వ్యాపించింది. లాక్‌డౌన్ సమయంలో కేవలం జిహెచ్‌ఎంసికే పరిమితమైన కేసులు అన్‌లాక్ పీరియడ్‌లో అన్ని జిల్లాలకు వ్యాపించాయి. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పతాక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

జిహెచ్‌ఎంసితో పాటు జిల్లాల్లోనూ వైరస్ వర్రీ…

కరోనా వైరస్ గ్రేటర్ ప్రజలకు వణుకుపుట్టిస్తుంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా కేంద్రాల్లో నివసించే ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈనెల 21 నుంచి 27వ తేది వరకు జిహెచ్‌ఎంసి పరిధిలో ఏకంగా 4568 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ నమోదవుతున్న మొత్తం కేసుల్లో 65 శాతం గ్రేటర్ పరిధిలోనే వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు మిగతా జిల్లాల్లోనూ వైరస్ తాండవిస్తుంది. గత వారం రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 1108 కేసులు నమోదు కాగా, ద్వితీయశ్రేణి నగరమైన వరంగల్ అర్బన్‌లో 577 కేసులు తేలాయి. జిహెచ్‌ఎంసి తర్వాత రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని కేసుల సంఖ్యను పరిశీలిస్తే అర్థమవుతోంది.

అదే విధంగా మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 554, సంగారెడ్డిలో 441, కరీంనగర్‌లో 428, నిజామాబాద్‌లో 263, నల్గొండ 242, కామారెడ్డి 209, నాగర్‌కర్నూల్ 209, పెద్దపల్లి జిల్లాల్లో 191 కేసులు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పైన పేర్కొన్న జిల్లాల్లోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని ఆరోగ్యశాఖ చెబుతోంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 96, భద్రాదిలో 62, జగిత్యాల 84, జనగాం 90, భూపాలపల్లి 109, గద్వాల 89, ఖమ్మం 123, ఆసిఫాబాద్ 6,మహబూబ్‌నగర్ 161, మహబూబాబాద్ 177, మంచిర్యాల 70, మెదక్ 150, ములుగు 95, నారాయణపేట్ 23, నిర్మల్ 5,సిరిసిల్లా 168, సిద్ధిపేట్ 64, సూర్యాపేట్ 188, వికారాబాద్ 45, వనపర్తి 52,వరంగల్ రూరల్ 154, యాదాద్రిలో 66 కేసులు చొప్పున తేలినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోసుల్లో ఈ కేసుల సంఖ్య మరింత రెట్టింపు అవుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచిస్తుంది.

Corona Cases increased in Telangana Districts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News