Friday, April 26, 2024

గ్రామాల్లో పెరుగుతున్న కేసులు: కలెక్టర్ రోనాల్డ్ రోస్

- Advertisement -
- Advertisement -

Facilities to provide public healthcare available to the public

నాగర్ కర్నూల్: ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నట్లు తమకు నివేదికలొస్తున్నాయని కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా కట్టడికి డిపిహెచ్ శ్రీనివాస రావు, కలెక్టర్ శర్మన్‌తో ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రోస్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొవిడ్ నియంత్రణకు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో అధిక కరోనా కేసులున్న వెల్దండ, తెల్కపల్లి, రఘుపతి పేట పిహెచ్‌సిల పరిధిలో కరోనా వ్యాప్తికి గల కారణాలు చేపట్టిన చర్యలు వివరాలు తెలుసుకున్నామన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతీ గ్రామ, మండల, ప్రతీ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణలో సర్పంచ్‌లు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఒ, పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేయాలని ఆర్థిక కార్యదర్శి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News