Friday, March 29, 2024

భారత్ లో 90,802 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Corona cases india last 24 hours

 

ఢిల్లీ: భారత్‌ను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా విజృంభిస్తుండడంతో దాదాపుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కనాడే 90,802 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1016 మంది మరణించారు. 90 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో సారి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42.04 లక్షలకు చేరుకోగా 71,701 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా నుంచి 32.5 లక్షల కోలుకోగా 8.82 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అమెరికా (64.6 లక్షలు)లతో తొలి స్థానంలో ఉండగా భారత్ (42.04 లక్షలు) రెండోస్థానం, బ్రెజిల్ (41.37 లక్షలు)లతో మూడో స్థానంలో ఉంది. మృతుల సంఖ్యలో వరసగా అమెరికా(1.93 లక్షలు), బ్రెజిల్(1.26), ఇండియా(71 వేలు), మెక్సికో(67 వేలు), యుకె(41 వేలు), ఇటలీ(35వేలు)గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకు 4.95 కోట్ల మందికి కరోనా టెస్టులతో భారత్ మూడో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News