Saturday, April 20, 2024

కరోనా కేసులు… తెలంగాణ@77…. ఎపి@40

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ 77 మందికి సోకగా 14 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ వ్యాధితో తెలంగాణలో ఎనిమిది మంది చనిపోయారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వివరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. అక్కడికి వెళ్లిన ఎవరైన స్వచ్ఛందంగా ఆస్పత్రిలో చేరాలని ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 40కు చేరాయి. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని ఎపి ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీలో మత ప్రచారానికి వెళ్లిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. భారత్ దేశంలో 1400 మందికి కరోనా వైరస్ సోకగా ఇప్పటి వరకు 47 మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ నుంచి 140 మంది కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 7,86,270కు చేరుకోగా 37,830 మంది మరణించారు. అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 1,64,266కు చేరుకోగా 3170 మంది చనిపోయారు. ఇటలీలో కరోనా వైరస్ 101,739 మందికి సోకగా 11,591 మంది మృతి చెందారు.

courtesy by covid19india

రాష్ట్రాలు
కరోనా కేసులు

కరోనా నుంచి కోలుకున్నవారు

మృతులు
MAHARASHTRA 248 39 10
KERALA 234 20 2
UTTAR PRADESH 101 17
DELHI 97 6 2
KARNATAKA 91 6 3
RAJASTHAN 83 3
TELANGANA 77 14 8
TAMIL NADU 74 4 1
GUJARAT 73 5 6
MADHYA PRADESH 66 4
JAMMU AND KASHMIR 49 1 2
PUNJAB 41 1 3
HARYANA 36 17
WEST BENGAL 26 4
ANDHRA PRADESH 40 1
BIHAR 16 1
CHANDIGARH 13
LADAKH 13 3
ANDAMAN AND NICOBAR ISLANDS 10
CHHATTISGARH 8
UTTARAKHAND 7 2
GOA 5
HIMACHAL PRADESH 3 1 1
ODISHA 3
MANIPUR 1
MIZORAM 1
PUDUCHERRY 1
TOTAL 1400 140 47
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News