Friday, April 19, 2024

అదుపులోకి వస్తోన్న కరోనా

- Advertisement -
- Advertisement -

Corona coming under control in India

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపు లోకి వస్తోంది. కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కొత్త కేసులు 13 వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులకు, క్రియాశీల కేసులు 237 రోజులకు కనిష్ఠానికి క్షీణించాయి. మరణాల సంఖ్య 200 దిగువనే నమోదయ్యాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. సోమవారం 14,81,314 మంది పరీక్షలు చేయించుకోగా వారిలో 13,058 మందికి వైరస్ సోకిందని తేలింది. అంతక్రితం రోజు కంటే కొత్త కేసులు 500 మేర తగ్గాయి. సోమవారం 19,470 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,40,91,378 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో 3,34,58,801 మంది వైరస్‌ను జయించారు.

ఇటీవల కాలం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,83,118 గా ఉంది. క్రియాశీల రేటు 0.54 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.14 శాతానికి పెరిగింది. సోమవారం 164 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,52,454 మంది మృతి చెందారు. ఇక టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. సోమవారం 87,41,160 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు డోసుల పంపిణీ సంఖ్య 98 కోట్ల మార్కును దాటి 100 కోట్లకు చేరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News