Thursday, March 28, 2024

తెలంగాణలో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైంది: ఆరోగ్య శాఖ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం సాయంత్రం డిఎంఇ రమేష్ రెడ్డీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీలోకి వెళ్లింది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వచ్చే నాలుగైదు వారాలు చాలా సంక్లిష్టం. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిస్థితి ఉంది. కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిది. తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయి. మెడికల్ సిబ్బంది చాలా ఒత్తిడిలో ఉన్నారు. యాక్టీవ్‌గా ఉన్నవాళ్లకు టెస్ట్ అవసరం లేదు. లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయించుకోండి. వైద్యశాఖలో వెయ్యిమందికి పైగా సిబ్బంది, కుటుంబాలు కరోనా బారినపడ్డారు. కరోనా వైద్యానికి లక్షల రూపాయలు అవసరం లేదు. కరోనా నియంత్రణకు రూ.100 కోట్లు కేటాయింపు. 70 శాతం మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారిలో 99 శాతానికి పైగా రికవరీ. తెలంగాణలో రోజుకు 15వేల టెస్టులు జరుగుతున్నాయి” అని వివరించారు.

Corona Community spread begin in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News