Thursday, April 25, 2024

కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్దం

- Advertisement -
- Advertisement -

Corona control Medication kit details

సిఎం కెసిఆర్ ప్రదర్శించిన చార్ట్‌పై సర్వత్రా ఆసక్తి
అదే కరోనా నియంత్రణ మందుల కిట్

మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా మహమ్మరి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా యుద్ద ప్రాతిపదికన ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టడం, ఇందులో భాగంగా స్వల్ప జ్వరం మొదలు కరోనాకు సంబంధించి చిన్న పాటి లక్షణాలున్నా టెస్టులతో సంబంధం లేకుండా అక్కడికక్కడే మందులను అందించడంతో పాటు వైద్య సలహాలు, సూచనలను అందజేయడమే కాకుండా వారితో వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.

అంతేకాకుండా అన్ని ప్రభుత్వం అసుపత్రులు, బస్తీ దవాఖానా, ఆరోగ్య కేంద్రాల వరకు అన్నింట్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించడం, అవసరమైనవారికి మందులను అందజేస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కరోనపై నిర్వహించిన సమిక్షా సమావేశంలో ఒక మందుల చార్ట్‌ను ప్రదర్శించారు. అప్పటి నుంచి ఆ చార్ట్‌లో ఏముందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఆ చార్ట్‌లో ఏముందో తెలుసుకుందాం. కరోనా విజృంభిస్తుండడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఓకొత్త ప్రయోగం చేసింది.

ఎవరికైనా కరోనా కు సంబంధించి చిన్నపాటి లక్షణాలున్నా ఆ వెంటనే వైద్యం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంది. 5 రోజుల పాటు సూచించిన మందులు వాడడం, అప్పటికీ జ్వరం ఇతర లక్షణాలు తగ్గకపోతే మరో 5 రోజుల పాటు స్వల్ప శక్తితో కూడిన స్టెరాయిడ్‌లను వాడాలని ఉచిత మందుల కిట్‌లను అందజేయడంలో పాటు ముఖ్యమంత్రి ప్రదర్శించిన చార్ట్ ద్వారా ప్రజలను చైతన్యపర్చుతున్నారు. 6 నిమిషాల పాటు నడిచిన అనంతరం ఆయాసంలా అనిపిస్తే కూడా డాక్టర్లను సంప్రదించి ఈ మందులను వాడాలని సూచిస్తున్నారు. ఈ విషయాలను తెలుపుతూ “ కోవిడ్ మందుల వాడకంపై మార్గదర్శకాలు ఆరోగ్య పరిరక్షణ”కు సంబంధించి రూపుదిద్దుకున్న అనే ఈ చార్ట్‌నే సిఎం ప్రదర్శించారు.

సిఎం ప్రదర్శించిన చార్ట్‌లోని మందులు వాటి వినియోగం 
1.డాక్సిసైక్లిన్ : యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ టాబ్లెట్స్ , ఉదయం ,రాత్రి వేళలో ఒక్కొక్కటి చోప్పున 5 రోజులు వాడాలి
2. లెవోసైటైరిజైన్ : జలుబు, దగ్గు కు ప్రతి రోజు ఉదయం ఒక్కొక్కటి చోప్పున 10 రోజులు వాడాలి
3. రాంటాక్ : ఎసిడిటీ నివారణకు ప్రతి రోజు ఉదయం ఒక్కటి చొప్పున 10 రోజులు వాడాలి.
4.విటమిన్ సి : ఇమ్యూనిటీ పెంపుకు ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో ఒక్కోక్కటి చోప్పున 10 రోజులు వాడాలి.
5.మల్టీ విటమిన్ సి : ఇమ్యూనిటీ పెంపుకు ప్రతి రోజు ఉదయం ఉదయం రాత్రి వేళాల్లో ఒక్కోక్కటి చోప్పున 10 రోజులు వాడాలి
6.విటమిన్ డి : ఇమ్యూనిటీ పెంపుకు ప్రతి రోజు ఉదయం ఒకటి చోప్పున 10 రోజులు వాడాలి

ఈ మందులు వాడినప్పటికీ జర్వం వచ్చి 5 రోజులైన తగ్గకుంటే డేక్సామెట్ / మిథైల్ ప్రెడ్నిసలోన్ అనే 8 ఎంజి x2 స్టెరాయిడ్ టాబ్లెట్‌ను ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళ్లాలో ఒక్కోకటి చోప్పున 5 రోజులు వాడాలి . అదేవిధంగా ప్రతిరోజు ఉష్ణోగ్రత(టెంపరేచర్) పరీక్షించుకోవాలి. ఇలా సూచించిన మందులు వాడితే కరోనాను ముందుస్తుగానే నివారించవచ్చాని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News