Friday, April 19, 2024

రెండు వారాల్లో తారస్థాయికి మరణాలు

- Advertisement -
- Advertisement -

Trump

 

వాషింగ్టన్: మరో రెండు వారాల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జూన్1నాటికి కరోనా ప్రభావం తగ్గి దేశం కుదుటపడుతుందన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామాజిక దేరానికి సంబంధించిన నిబంధనలను ఏప్రిల్ 30 ఏరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈస్టర్ నాటికి కరోనా తీవ్రత తగ్గుతుందని తాను మొదట భావించానని, అయితే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదని ఆయన అన్నారు. అంతకు ముందు ప్రముఖ ప్రభుత్వ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫాసీ మాట్లాడుతూ, అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య లక్షకు చేరుకుంటుందని తాను ఇంతకుముందు చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని హెచ్చరించారు.

ఇది జరక్కుండా చూడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, సామాజిక దూరానికి సంబంధించిన ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలన్న నిర్ణయం చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. కాగా కరోనా కట్టడికి ఆంక్షలను 15 రోజుల తర్వాత ఎత్తివేయాలని మొదట భావించిన ట్రంప్ ఇప్పుడు ఈ ఆంక్షలను పొడిగించాలని నిర్ణయించడం అమెరికాలో ఈ వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సిక్లోరిన్‌ను న్యూయార్క్‌లో 1100 మంది కరోనా సేషెంట్లకు ఇస్తున్నటు ్లట్రంప్ చెప్పారు. అంతేకాదు, ఇది దేశంలో కరోనాపై జరిపే పోరులో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు.

కరోనా రోగులకు చికిత్స కోసం ఈ మందుకు అనుమతి ఇచ్చిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. రెండు రోజుల క్రితమే న్యూయార్క్‌లో కరోనా పేషెంట్లకు ఈ మందు ఇవ్వడం ప్రారంభించారని, త్వరలోనే ఫలితాలు తెలుస్తాయని కూడా ట్రంప్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. మిగతా మందులతో పోలిస్తే పారాసిటమాల్ తర్వాత హైడ్రాక్సిక్లోరిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లు తక్కువగా ఉండడంతో డాక్టర్లు సైతం ఇప్పటికే కరోనా కేసుల చికిత్సలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

 

Corona death toll in US is rising in two weeks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News