Wednesday, April 24, 2024

చైనాలో 56కు చేరిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

Corona

 

భారతీయుల ఆరోగ్యంపై ఎంబసీ పర్యవేక్షణ
విదేశాంగమంత్రి జైశంకర్ వెల్లడి

బీజింగ్: చైనాలో భయంకరమైన కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 56కు చేరిందని చైనా ఆరోగ్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి ఉందని ధ్రువీకరించిన కేసుల సంఖ్య 1,975కు పెరిగిందని, వారిలో 324 మంది ఆందోళనకరంగా ఉందని వారు చెప్పారు. వైద్యపరంగా 2019 ఎన్‌కోవి అనే పేరుతో వ్యవహరిస్తున్న కరోనా వ్యాధికి సంబంధించి మొత్తం 2,684 మందికి ఈ వ్యాధి సోకివుంటుందని అనుమానంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. హు బెయి ప్రావిన్స్‌లో వూహాన్, మరో 17 పట్టణాలు ఇప్పటికీ కరోనా కోరల్లోనే చిక్కుకుని ఉన్నాయి. బీజింగ్ సహా అనేక నగరాలకు ఈ వ్యాధి విస్తరిస్తోంది.

పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, అయి నా ఎదుర్కొంటామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం ప్రకటించారు. ఇండియన్ ఎంబస్సీ శ్రద్ధ చైనాలో భారతీయులు ఎలా ఉన్నారు, వారి ఆరో గ్యం ఎలా ఉంది అన్న విషయాలపై బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆదివారం చెప్పారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్స్‌లోని వూహాన్ పట్టణంలో 250 మందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు సాయమందించేందుకు రాయబార కార్యాలయం హెల్ప్ లైన్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు @EOIbeijingను చూడవచ్చని సూచించారు.

Corona deaths in China reach 56
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News