Friday, March 29, 2024

ఆందోళన కలిగిస్తున్న డెల్టా వేరియంట్ : డబ్ల్యుహెచ్‌వొ

- Advertisement -
- Advertisement -

Corona Delta variant is most dangerous:WHO

 

జెనీవా : భారత్‌లో ఎక్కువగా వ్యాపించిన కరోనా డెల్టా (బి 1,617 ) వేరియంట్ మొత్తంలో ఒక స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియచేసింది. ఈ రకం వేరియంట్ వైరస్ మళ్లీ మూడు స్ట్రెయిన్లుగా మారిందని, వాటిలో కూడా బి.1.617.2 రకం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని వెల్లడించింది. గత నెల బి.1.617 ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఇప్పుడు దీనిలో కూడా బి. 1.617 .2 వేరియంట్‌ను ఆందోళన కలిగించే వేరియంట్‌గా డబ్లుహెచ్‌వొ గుర్తించింది. మిగతా రెండింటి ప్రభావం తక్కువేనని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతివారం విడుదల చేసే నివేదికలో భాగంగా ఈ వివరాలు వెల్లడించింది.

ఈ రకం వైరస్ వ్యాపిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తాము గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఈ వేరియంట్‌పై పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. బి.1.617.1 స్ట్రెయిన్ స్థాయిని తగ్గించగా, బి.1.617.2 స్ట్రెయిన్‌ను గమనిస్తుండాలని పేర్కొంది. భారత్‌లో మొదటిసారి కనిపించిన ఈ వేరియంట్‌కు డెల్టా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బి.1.617.2 తోపాటు మరో మూడు వేరియంట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని డబ్లుహెచ్‌వొ ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్లను కూడా ఇవి బోల్తా కొట్టిస్తున్నట్టు తెలియచేసింది. ఆయా దేశాల వేరియంట్లకు సోమవారం డబ్లుహెచ్‌వొ గ్రీకు పేర్లు పెట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News