Friday, April 26, 2024

కరోనా ఎఫెక్ట్.. అన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న ఓ జంట

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఖమ్మం: కరోనా వైరస్ ప్రభావం వివాహాలపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో విమాన ప్రయాణాల్లో అంక్షలు విధించారు. దీంతో ఓ జంట వివాహం అన్‌లైన్‌లో జరిపించాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాలకు చెందిన యువతికి, ఖమ్మం పట్టణానికి చెందిన యువకుడితో వివాహం కుదిరింది. ఈనెల15వ తేదీ రాత్రి నిఖా జరిగే విధంగా మత పెద్దలు ముహుర్తాన్ని నిర్ణయించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో విమాన ప్రయాణాల్లో అంక్షలు విధించడంతో సౌదిలో ఉన్న వరుడు పెళ్ళీ సమయానికి ఖమ్మంకు చేరుకోలేకపోయారు.దీంతో ముందుగా అనుకున్న ముహుర్తానికే నిఖా జరిపించాలని ఇరువురి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని కొణిజర్ల సమీపంలో ఒక ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో మత పెద్దల సమక్షంలో అన్ లైన్ ద్వారా వివాహం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరుడు, వధువుకు మత పెద్దలు నిఖా జరిపించారు.

ఈ సందర్బంగా వధువును ప్రముఖులు ఆశీర్వదించారు. మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర్లు ఇతర ప్రముఖులు కూడా హాజరై వధువును ఆశీర్వదించారు. ఇది ఇలా ఉండగా ఏఫ్రిల్‌లో ఏలాంటి వివాహలను జరుపుకోవద్దని, ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్ ఏఫ్రిల్ లో బుక్ చేసుకోవద్దని ప్రభుత్వం అదేశించిన విషయం తెలిసిందే. దీంతో వేసవి కాలంలో పెళ్ళీలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తే మాత్రం కేవలం 200 మంది బంధు మిత్రులు హాజరయ్యే విధంగా చేసుకోవాలని ప్రభుత్వం వెసలు బాటు కల్పించింది. మొత్తం మీద ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వివాహాలు ఇతర శుభకార్యాలయాలను ప్రజలు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది.

Corona effect: Couple married Through Video Conference

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News