Home జాతీయ వార్తలు వైద్యులపై కరోనా పంజా… దేశంలో ఇప్పటి వరకు 99 మంది మృతి

వైద్యులపై కరోనా పంజా… దేశంలో ఇప్పటి వరకు 99 మంది మృతి

Corona Effect on Doctors in Indiaఢిల్లీ: కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులపై కరోనా తన పంజా విసురుతోంది. కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి పోరాడుతున్న వైద్యులను కరోనా విడిచి పెట్టడం లేదు. ఇప్పటి వరకు దేశంలో 1,302 మంది వైద్యులకు కరోనా సోకింది. ఈ క్రమంలో 99 మంది వైద్యులు చనిపోయారని ఐఎంఎ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం వైద్యులను అప్రమత్తం చేసింది. కరోనా సోకిన వారిలో 586 మంది ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు ఉండగా, 566 మంది రెసిడెంట్ వైద్యులు, 150 మంది హౌస్ సర్జన్లు ఉన్నారని ఐఎంఎ పేర్కొంది. మృతి చెందిన వైద్యుల్లో 73 మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారని, 19 మంది 35-50 ఏళ్ల లోపు వారు ఉన్నారని, ఏడుగురు మాత్రమే 35 ఏళ్లలోపు ఉన్నవారు ఉన్నారని ఐఎంఎ తన అధ్యయనంలో తెలిపింది. కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దాని బారిన పడే అవకాశం ఉందని ఐఎంఎ హెచ్చరిస్తోంది.