Home తాజా వార్తలు హీరో రాజశేఖర్ ఇంట్లో కరోనా కలకలం

హీరో రాజశేఖర్ ఇంట్లో కరోనా కలకలం

Corona Effect On Hero Rajasekhar Familyహైదరాబాద్ : కరోనా సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు వారి కుమార్తెలు శివానీ, శివాత్మికలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తమ కుటుంబానికి కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు. తాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని, తమ కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా నుంచి కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. తాను ,జీవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం తమ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కరోనా నుంచి కోలుకొని తాము త్వరలోనే ఇంటికి వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నుంచి రాజశేఖర్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.