Home Default కరోనాతో వణికిపోతున్న మహా పోలీసులు

కరోనాతో వణికిపోతున్న మహా పోలీసులు

Corona Effect On Maharashtra Police Departmentముంబయి : కరోనాతో మహారాష్ట్ర పోలీసులు వణికిపోతున్నారు. ఒక్క రోజులోనే 121 మంది పోలీసులు కరోనా బారిన పడగా, ఇద్దరు చనిపోయారు. దీంతో మహారాష్ట్రలో చనిపోయిన పోలీసుల సంఖ్య 102కు చేరుకుంది. చనిపోయిన వారిలో ఎనిమిది మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 7,176 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,939 మంది పోలీసులు కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి కరోనాతో పోరాడుతున్న పోలీసులపై వైరస్ పంజా విసురుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు బెంబేలెత్తుతున్నారు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో మహమ్మారి కరాళనృత్యం చేస్తుండడంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట ఉండడం కలవరానికి గురి చేస్తుంది. రోడ్ల మీదకు వచ్చినప్పుడు భౌతికదూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు.