Friday, April 19, 2024

స్వదేశానికి సౌతాఫ్రికా క్రికెటర్లు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భారత్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ అర్ధాంతరంగా రద్దు కావడంతో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మంగళవారం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు సొంత దేశానికి ప్రయాణమయ్యారు. కరోనా వ్యాధి నేపథ్యంలో భారత్‌దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. ధర్మశాలలో జరిగిన మొదటి వన్డే వర్షార్పణం అయ్యింది. భారీ వర్షం వల్ల తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. అయితే లక్నో, కోల్‌కతా వేదికగా జరగాల్సిన రెండు వన్డేలను భారత క్రికెట్ బోర్డు అర్ధాంతరంగా రద్దు చేసింది. కరోనా వ్యాధి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సిరీస్‌ను రద్దు చేయడమే మంచిదనే నిర్ణయానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వచ్చాయి. ఇందులో భాగంగానే సిరీస్‌ను మధ్యలోనే నిలిపి వేశారు. ఇక, సిరీస్ రద్దయినా సౌతాఫ్రికా క్రికెటర్లు మాత్రం భారత్‌లోనే ఉండి పోయారు. కరోనా నేపథ్యంలో సౌతాఫ్రికాలోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో క్రికెటర్లు చాలా రోజుల వరకు భారత్‌లోనే ఉండి పోవాల్సి వచ్చింది. చివరికి సౌతాఫ్రికా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో మంగళవారం సఫారీ ఆటగాళ్లు స్వదేశం బయలు దేరారు.

Corona Effect: South Africa Cricket team Returns Home

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News