Friday, March 29, 2024

సిసికి విరాళాల వెల్లువ.. సినీ కార్మికులకు యువ హీరోల చేయూత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో రోజురోజు పెరుగుతున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత ఏప్రిల్ 14వ తేదీ వరకు 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు పలువురు సినీ, వ్యాపార, క్రీడ ప్రముఖలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా ఆర్ధి సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే, కరోనా సంక్షోభం నుండి సినిమా రంగంలో పనిచేసే రోజువారీ కూలీ కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు చేపట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. సీనియ‌ర్, యంగ్ హీరోలు త‌మ‌కి తోచినంత ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ ఛారిటీకి చిరంజీవి, రూ.కోటి, నాగార్జున రూ.కోటి, దగ్గుబాటి కుంటంబం రూ.కోటి, మహేష్ బాబు రూ.25 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు ఇవ్వగా.. తాజాగా మాస్ మ‌హారాజా ర‌వితేజ రూ.20ల‌క్షలు, శ‌ర్వానంద్ రూ.15 ల‌క్ష‌లు, మెగా హీరోలు రామ్ చరణ్ రూ.30 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు, అక్కినేని నాగచైతన్య రూ.30 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి రూ.1 లక్ష, కార్తికేయ రూ.2 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రీయేషన్ బ్యానర్ రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.

Corona Effect: Tollywood Celebrities Donations To CCC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News