Sunday, December 3, 2023

జగిత్యాల జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు

- Advertisement -
- Advertisement -
Corona fatalities in Jagtial district
భారీగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు, రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత,  గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కొవిడ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. గత పక్షం రోజుల నుంచి రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా గుర్తించి రక్షణ చర్య లు తీసుకుంటున్నారు. ఈ నాలుగైదు రోజుల నుంచి కేసు లు మరి ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితం రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన ఓ యువకుడు కరోనా బారిన పడి మృతి చెందగా, తాజాగా శనివారం గొల్లపల్లి మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులకు కరోనా కాటుకు బలయ్యారు.

గ్రామాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్టా ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించి కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు జిల్లాలో పెద్దగా కరోనా మరణాలు నమోదు కాకపోగా, సెకండ్‌వేవ్ కరోనాతో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల క్రితం వరకు పదుల సంఖ్య కూడా దాటని కరోనా కేసులు గత పక్షం రోజుల నుంచి కేసులు వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. జిల్లాలో 1600 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతుండగా, ఈ కేసులన్నీ గత పక్షం రోజుల్లో నమోదైనవేనని తెలుస్తోంది. మన పొరుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభించడం… అక్కడి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో మన జిల్లా నుంచి వలస వెళ్లిన వారంతా స్వగ్రామాలకు తిరుగుముఖం పట్టడం.. ఇటీవల జరిగిన పండగలు, జాతరల్లో జనం పెద్ద ఎత్తున గుమిగూడడంతో కరోనా వైరస్ ఒక్కసారిగా వ్యాప్తి చెంది కేసులు అధికమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

కోవిడ్ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా జనం ఏమవుతుందిలే అని నిర్లక్షం ప్రదర్శించడం వల్లే కరోనా తీవ్ర రూపం దాల్చి ప్రాణాలను మిం గేసే పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఒక్కో గ్రామ ంలో పదుల సంఖ్యలో కేసులు నమోదువుతున్నా దృష్టా కరోనా కట్టడి కోసం గ్రామ పంచాయతీలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ విధిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. ఇలా జిల్లాలో చాల గ్రామాల్లో స్వచ్చంధ లాక్‌డౌన్ అమలవుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేస్తున్న ట్లు కలెక్టర్ రవి ప్రకటించడంతో పాటు కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క రూ విధిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారికి అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. కరో నా కేసులు పెరగడం… ఈ రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడటం జిల్లా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలాఖరు వరకు కరోనా తీవ్ర రూపం దాల్చనుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని, అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News