Friday, March 29, 2024

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

markaj piligrims

 

తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం
ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు
మర్కజ్ ఘటన కలకలం

చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో జనం హాజరు హాజరైనట్లు వార్తలు రావడంతో వారిని గుర్తించి వారిని మిగతా వారికి దూరంగా ఉంచే చర్యలను దక్షిణాది రాష్ట్రాలు ముమ్మరం చేశాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి 2000 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయినట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన ఆరుగురు కూడా గత నెల జరిగిన ఈ ప్రారనా సమావేశాలకు హాజరైనవారే కాగా, తమిళనాడులో మంగళవారం ఒక్క రోజే వెలుగు చూసిన 57 కేసుల్లో దాదాపు 50 కేసులు దీనితో ముడిపడినవే కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి కోసం, వారితో సన్నిహితంగా సంచరించిన వారి కోసం రాష్ట్రమంతటా జల్లెడపడుతున్నాయి. ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు జరిపించుకోవడానికి ముందుకు రావాలని ఆయాప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి కూడా.

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మార్చి 1- 15 మధ్య జరిగిన ప్రార్థనా సమావేశాలకు దేశ విదేశాలనుంచి వేలాది మంది హాజరైనారు. అయితే ఈ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందిలో కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైనాయి. ఈ సమావేశాలకు హాజరైన జమ్మూ, కశ్మీర్‌కు చెందిన వృద్ధుడు మరణించడంతో ఈ ఉదంతం మొదట వెలుగులోకి వచ్చింది. అక్కడ తీగ కదిపితే డొంకంతా కదిలినట్లయింది. అయితే దీని ప్రభావం తెలంగాణ, తమిళనాడులపై తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు 1000 మందికి పైగా హాజరైనట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కాగా తమిళనాడునుంచి 1500 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరు కాగా 1131 మంది తిరిగి వచ్చారని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి చెప్పారు. వీరిలో 515 మందిని గుర్తించడం జరిగిందని, మిగతా వారి అడ్రస్సులు పూర్తిగా తమ వద్ద లేవని ఆయన చెప్పారు.

తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాలకు హాజరైన వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు జరిపించుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. వివరాలు తెలియకుండా ఉన్న వారిలో కొంతమంది ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియకపోవడంతో వీరిలో కొందరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున తక్షణం తమను సంప్రదించాలని తమిళనాడుకు చెందిననేషనల్ హెల్త్ మిషన్ తబ్లిగి జమాత్ సోదరులకు విజ్ఞప్తి చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజే కొత్తగా 43 కరోనా కేసులు వెలుగు చూడగా, వీరిలో దాదాపు అందరూ ఈ సమావేశాలకు వెళ్లివచ్చిన వారే కావడం గమనార్హం. ఈ రాష్ట్రంనుంచి కూడా 700 మందికి పైగా ఈ సమావేశాలకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా స్వచందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞొప్తి చేసింది. కాగా నిజాముద్దీన్ ఘటనలతో సంబంధం ఉన్న 78 మందిని కర్నాటక ఇప్పటివరకు గుర్తించగా, కేరళలో ఈ సమావేశాలకు వెళ్లివచ్చిన వారందరినీ ప్రభుత్వం గుర్తించింది.

ఢిల్లీ సమావేశాలతో సంబంధం ఉన్న 78 మందిని గుర్తించడం జరిగిందని, వీరంతా ఈ సమావేశాలకు హాజరు కాకపోయి ఉండవచ్చని, అయితే అక్కడికి వెళ్లివచ్చిన వారితో సంబంధాలు ఉన్నందున వారినందున ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచడం జరిగిందని కర్నాటక ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి జావేద్ అఖ్తర్ చెప్పారు. వీరిలో చాలా మంది 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నందున అందరినీ కోవిడ్19 పరీక్షలకు గురి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా ఢిల్లీ సమావేశాలకు ఎవరెవరు వెళ్లారు, ఎక్కడినుంచి వెళాలరనే పేర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వారందరిపైనా నిఘా ఉంచినట్లు కేరళ సిఎం పినరాయి విజయన్ చెప్పారు. ఇదిలా ఉండగా పుదుచ్చేరిలో బుధవారం కొత్తగా బయటపడిన రెండు కేసులు కూడా ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారే కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

 

Corona High impact on Telangana and Tamil Nadu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News