Tuesday, April 23, 2024

ఆపరేషన్ కరోనా.. రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులు

- Advertisement -
- Advertisement -

Corona Isolation wards in Railway Coaches

 

హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. రైల్వే శాఖ కోవిడ్19 బాధితుల కోసం బోగీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది. బాధితులను నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన మేరకు రైళ్లలో మార్పులు చేస్తోంది. ఇందు నిమిత్తం బాధితులకు చికిత్స అందిం చేందుకు అనువుగా బోగీలను మారుస్తోంది. కోవిడ్19 బాధితులు ఉండేందుకు వీలుగా త్రీటైర్ కోచ్‌లో మధ్యనుండే పడకలను తొలగిస్తోంది. రోగిని నిర్బంధంలో ఉంచేందుకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలవిలలాడిస్తోంది. కరోనా ఒక భయం కరమైన వ్యాధి. కరోనా వైరస్ నివారణకు మందు లేదు.. నియంత్రణ ఒక్కటే శరణ్యం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదన్న వార్తలొస్తున్న తరుణంలో అందుకనుగుణంగా భారత్ రైల్వేశాఖ సైతం తన వంతు సహాయాన్ని అందిం చేందుకు నడుం బిగించింది.

ఈ మేరకు రైలు బోగీలనే ఐసోలేషన్ వార్డులుగా మారుస్తోంది. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలచడంలో రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. ప్రతి కోచ్‌లో రెండు మరుగుదొడ్లను స్నానాల గదులుగా మార్పు, బాత్రూంలో ఫ్లోటింగ్ టాయిలెట్ పెన్ ఏర్పాటు, ప్రతి బాత్రూంలో హ్యాండ్ షవర్, ఒక బకెట్ ఏర్పాటు సౌకర్యం, బోగీ పక్కన, మధ్య ఉండే పడకలను తొలగించి ఇద్దరి నుంచి నలుగురు బాధితులు ఉండేలా ఏర్పాటు, ఐసోలేషన్ కోసం వచ్చేవారు తమ సామాగ్రి పెట్టుకునేందుకు వీలుగా అల్మారాలు, వైద్యపరికరాలను నడపడానికి కంపార్ట్‌మెంట్‌లో 220వోల్ట్ విద్యుత్ అనుసంధానం, ప్రతి కోచ్‌లో పది ఐసోలేషన్ వార్డులు, ప్రత్యేకంగా కర్టెన్‌లు, రోగుల కోసం 415 ఓల్ట్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు, ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేసిన కోచ్‌లను నిత్యం శాని టైజేషన్, ఐసోలేషన్ వార్డు వినియోగం, వినియోగం తర్వాత పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేసే విధంగా సకల ఏర్పాట్లను రైల్వే శాఖ సిద్ధం చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న 13వేలకు పైగా రైళ్లు నడిచే భారత్‌లో రైళ్లను ఆసుపత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మొత్తం మూడు లక్షల బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్య సదుపాయాలను అందించేందుకు అవకాశమేర్పడుతుంది. ప్రణాళిక బద్ద రీతిలో రైల్వే కోచ్‌లలో ఐసోలేషన్ వార్డులు సిద్ధమయ్యాయి. బాధితులు ఎవరైనా సరే అసౌకర్యానికి ఫీలవ్వని రీతిలో ఈ ఐసోలేషన్ వార్డులు ఏర్పాట వుతున్నాయి. దరిమిలా బాధితులు పూర్తిస్థాయిలో ఐసోలేషన్ వార్డుల్లో ఉండేందుకు ఆసక్తిని కనబర్చే వీలుంది.

రైల్వేశాఖ తీసుకున్న ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అదే సందర్భంలో రైల్వే శాఖ ఆపరేషన్ కరోనాలో ఈ విధంగా భాగస్వామ్యం కావడం భేషుగ్గా ఉందని అంటున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి రానున్న కాలంలో మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ఈ కష్టకాలంలో ఆయా రాష్ట్రాలలో బాధితులకు అవసరమైన ఐసోలేషన్ సౌకర్యాలు ఉండకపోవచ్చన్న వాదనల నేపథ్యంలో రైల్వే శాఖ ఒక బృహత్తర ఆలోచనకు కార్యరూపాన్నిచ్చి బోగీలనే ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలుగా మార్పు చేయడం గమనార్హం.

 

Corona Isolation wards in Railway Coaches
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News