Saturday, April 20, 2024

అంతుచిక్కని కొత్త జన్యువులు

- Advertisement -
- Advertisement -

రోగ నిరోధక శక్తి ఛేదనలు
జనం విచ్చలవిడి తిరుగుళ్లు
వేరియంట్ రోగులతో సవాళ్లు
దేశంలో కరోనా రెండో పంజాకు కారణాలు

New UK variant of coronavirus has risen to 102

న్యూఢిల్లీ : కరోనా కేసులు తిరిగి పెరగడానికి ప్రజల నిర్లక్షం, కోడ్‌ను గాలికి వదిలివేయడమే కారణమని దేశంలోని ఆరోగ్య పరిరక్షణ నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గలేదు. ఇతర దేశాల నుంచి వ్యాప్తి జరుగుతోంది. ఈ క్రమంలో సరికొత్త వైరస్ జన్యువులు సంక్రమిస్తున్నాయి. ఓ వైపు వేరియంట్లు సోకిన వారు విచ్చలవిడిగా తిరగడం, ప్రజలలోకొవిడ్ సంబంధిత ప్రవర్తనలపట్ల సరైన అవగావహన లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం వంటి కారణాలు ఇప్పుడు దేశంలో రెండో దశ కరోనా ఉధృతికి దారితీసిందని నిపుణులు తేల్చిచెప్పారు. లాక్‌డౌన్, అన్‌లాక్ ప్రక్రియలు, తరువాత లాక్‌డౌన్ ఎత్తివేతల దశల తరువాత వైరస్ పట్ల ప్రజల్లో నిర్లక్షం నెలకొంటూ వచ్చిందని తెలిపారు.

గడిచిన 24 గంటలలో దేశంలో 1.15 లక్షల కొత్త కేసులు నమోదు కావడం, అమెరికాలో వైరస్ ఉధృతి స్థాయిని దాటిన పరిణామం తలెత్తడంపై నిపుణులు స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యబుధవారం 1,28,01,785కు చేరుకుని వైరస్ ప్రమాద ఘంటికలను తీవ్రతరం చేసింది. వరుసగా మూడో రోజు కూడా లక్ష కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో చేరడం ఆందోళన కల్గించే పరిణామం అయింది. దేశంలో ఇప్పటి పరిస్థితికి మూడు అంశాలు ప్రధానంగా దారితీశాయని వైద్య ఆరోగ్య నిపుణులు డాక్టర్ గిరిధర ఆర్ బాబు తెలిపారు. లైఫ్‌కోర్సు ఎపిడిమాలజీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయిన ఈ ప్రొఫెసర్ దేశంలో అంటువ్యాధుల వ్యాప్తి, వీటి నివారణ విషయంలో చాలా కాలంగా అధ్యయనం సాగిస్తున్నారు. ప్రజల నిర్లక్షం, కొత్త వేరియంట్లు సోకిన వారు, కొత్త వైరస్‌ల శీఘ్రతర వ్యాప్తి ఇప్పటి సెకెండ్ వేవ్‌కు దారితీశాయని వివరించారు.

కొత్త వైరస్ సోకిన వారు ఎక్కువ కావడంతోనే దేశంలో వేగంగా కేసులు పెరుగుతున్నాయని, అయితే దీనిని ప్రభుత్వం అంగీకరించడం లేదని, సంబంధిత విషయంపై ఆధారాలు లేకపోవడం వల్ల దేనిని సరిగ్గా నిర్థారించుకోలేకపోతున్నట్లు తెలిపారు. మనిషి రోగ నిరోధక శక్తిని కూడా ఛేదిస్తూ వచ్చే కొత్త వైరస్ జన్యువులతో కొవిడ్ సమస్య జటిలం అవుతోందన్నారు. ఇప్పుడు సాగుతోన్న వ్యాక్సిన్ ప్రక్రియను కూడా దెబ్బతీసే విధంగా ఈ వేరియంట్ల వ్యాప్తి ఉంటే మరీ సమస్య జటిలం అవుతుందన్నారు. ఇమ్యూన్ వ్యవస్థకు కూడా అతీతంగా వైరస్ జన్యువులు ప్రభావం చూపితే ఇటువంటి కేసులు పెరిగితే ఇకపైఆరోగ్యపరంగా ఇది జటిల సమస్య అయి ఇబ్బంది కల్గిస్తుందన్నారు.

బ్రెజిల్ రకంతో పలు చిక్కులు

సాధారణంగా బ్రెజిల్ రకం వైరస్‌లను చివరికి యాంటీబాడీస్ కూడా గుర్తించలేకపోతున్నాయి. ఇక ఇదే విధంగా దక్షిణాఫ్రికా వేరియంట్ అనుబంధ రకం వంటివాటిని ఇప్పటికి కనుగొనలేకపోతున్నామని తెలిపారు. ప్రజలలో నిర్లక్షం ఆసరాగా చేసుకుని కొత్త రకం వైరస్ ముంచుకువస్తోందని , యాంటీబాడీస్ క్షీణతతో పరిస్థితి దిగజారుతోందన్నారు. వ్యాక్సిన్‌లు వేసుకున్న వారికి కరోనా నిర్థారణలు, కరోనా వచ్చి నయం అయిన వారికి తిరిగి కరోనా రావడం వంటి పరిణామాలు ఎక్కువైతే దేశంలో ఇది ఆరోగ్యపరంగా పెను సవాలును విసురుతుంది. ఇప్పుడు పెరుగుతున్న కేసుల సంఖ్య అంశం ప్రమాదకర సంకేతాలే ఇస్తోందని డాక్టర్ గిరిధర్ చెప్పారు.

రి ఇన్‌ఫెక్షన్స్ గురించి పూర్తిస్థాయిలో అధ్యయనం జరగడం లేదన్నారు. వేరియంట్లు సోకిన వారు ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో యధావిధిగా తిరగడం వంటి పరిణామాలతో ఆరోగ్యవంతులు వైరస్ బారిన పడటం, ఇది కూడా తీవ్రస్థాయి వరకూ సరైన లక్షణాలను ప్రస్ఫుటం చేయకపోవడం వంటి పరిణామాలు వైద్య శాస్త్రానికి సవాలు అవుతాయని వివరించారు. పర్యావరణం,వాతావరణం, కాలుష్యం వంటి సమస్యలు , సామూహిక నైజం, కదలికలు వంటివి కూడా వైరస్ వ్యాప్తికి దారితీస్తున్నాయని తెలిపారు. ర్యాలీలు, భోజనాలు , పెళ్లిళ్లు వేడుకలు ఇటువంటివి అనేకం వైరస్ వ్యాప్తికి దారితీస్తుందన్నారు. కలిసి తిరిగినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్ అదుపులేకుండా వ్యాపిస్తుందన్నారు.

అయితే కొత్త నమూనాలతో ఈ సంక్రమణ పరిస్థితి మరింత ఇబ్బందికరం కావచ్చు అన్నారు. గిరిధర్ బాబు విశ్లేషణలతో అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఎన్‌కె అరోరా దాదాపుగా ఏకీభవించారు. ఇప్పటి వ్యాప్తికి రెండు మూడు కాదు 4 లేదా 5 కారణాలు ఉన్నాయని తెలిపారు. వైరల్ సంక్రమణలు అన్ని కూడా ఉధృతస్థాయిలోనే ఉంటాయని , గత ఏడాది సెప్టెంబర్‌లో కొవిడ్ 19 తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తరువాత ఇప్పుడు కొంచెం విరామమిచ్చినట్లు ఇచ్చి తిరిగి తీవ్రతకు చేరుకుంటున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. వైరస్ ఆరంభం అయిన తొలి ఆరునెలల్లో ప్రజలలో దీని పట్ల పూర్తి స్థాయిలో భయాలు పట్టుకున్నాయని, లాక్‌డౌన్ దశ పరిణామాలు తరువాత ప్రజలు వైరస్ పట్ల పూర్తిగా నిర్లక్షం వహించారని , కొవిడ్ సంబంధిత జాగ్రత్తలు, సంబంధిత ప్రవర్తనను వదులుకున్నారని తెలిపారు. లాక్‌డౌన్ నాటి పరిణామాల నుంచి ఆర్థికంగా తేరుకోవాలనే తపనతో ప్రజలలో జీవన క్రమంలో జోరు పెరుగడం, ప్రజల సమూహ సంచారాలు వంటివి కూడా వైరస్ వ్యాప్తికి దారితీస్తున్నాయని అన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ల పట్ల మొగ్గు చూపుతున్నా, దైనందిన క్రమంలో ఏ మేరకు వైరస్ జాగ్రత్తలు పాటిస్తున్నారు? పాటించేందుకు వీలుంటోందా? అనేవి ప్రశ్నలుగా మారాయని అన్నారు. వెరియంట్ల రోగులను విడిగా ఉంచడం జరుగుతోంది. అయినప్పటికీ కేసులు విపరీతంగానే పెరుగుతున్నందున సంక్రమణ స్థాయికి కారణం ఏమిటనేది మరింత స్పష్టం కావల్సి ఉందన్నారు. కొత్త వైరస్‌ల వల్లనే కేసులు పెరుగుతున్నాయని ఇప్పటికిప్పుడు చెప్పలేమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News