Home తాజా వార్తలు రెడ్ జోన్ లో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి : తమిళిసై

రెడ్ జోన్ లో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి : తమిళిసై

Corona Negative to Governor Tamilisai Soundararajanహైదరాబాద్‌ : రెడ్ జోన్ లో ఉన్నవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆదివారం ఆమె కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె ట్విట్టర్ ద్వారా మాట్లాడారు. ముందస్తు పరీక్షల వల్ల తమను తాము రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించవచ్చని ఆమె పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్క్ లు ధరించాలని ఆమె ప్రజలను కోరారు. దీంతో కరోనా కట్టడి సాధ్యమని ఆమె వెల్లడించారు.