Home తాజా వార్తలు కరోనా పరీక్షలు చేయించుకున్న అసదుద్దీన్

కరోనా పరీక్షలు చేయించుకున్న అసదుద్దీన్

Corona Negative to MIM Chief Asaduddin Owaisiహైదరాబాద్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ శనివారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాతబస్తీలో ఉన్న యునానీ ఆసుపత్రిలో ఆయన ఈ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవడానికే తాను కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఓవైసీ వెల్లడించారు. ఆంటీజెన్, ఆర్ టిపిసిఆర్ పరీక్షలు చేయించుకున్నానని, తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. అత్యవసర పనుల నిమిత్తమే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్ లు ధరించాలని ఆయన సూచించారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.