Friday, April 26, 2024

హోంక్వారంటైన్ గడవక ముందే రోడ్లపైకి రోగులు

- Advertisement -
- Advertisement -

Corona Patients on roads before home quarantine pass

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి ఆరు నెలలుగా విశ్వరూపం దాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. వైద్యశాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారి ఏదో ఒకరూపం తన ఉనికి చాటుకుంటుంది. గత వారం రోజుల నుంచి 350లోపు పాజిటివ్ కేసులు నమోదైతున్నాయి. ఆగస్టుల్లో కేసులు పెరగడంతో ప్రభుత్వం త్వరగా రోగులను గుర్తించేందుకు 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు, బస్తీదవాఖానలో ఉచితంగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడంతో రోజుకు వందలాది పరీక్షలు చేసుకుంటున్నారు. ఈఫలితాల్లో పాజిటివ్ తేలిన తరువాత ఎక్కువ లక్షణాలున్న వారిని గాంధీ ఆసుపత్రికి, మోతాదు లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్ చేసి స్దానిక వైద్యులు ఇంటికి వెళ్లి చికిత్స అందిస్తున్నారు.

హోంఐసోలేషన్ రోగులకు 28 రోజుల పాటు ఇంట్లో ఉంటూ వైరస్ తగ్గేవరకు చికిత్స చేసుకుని, పూర్తిగా తగ్గితే బయటకు వెళ్లాలి. కానీ కొంతమంది రోగులు 10 రోజులు దాటగానే కొంచెం చురుకుదనం అనిపిండచంతో దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. మరికొందరు సాయంత్రవేళ వాకింగ్ పేరుతో బయటకు వచ్చి, కొన్ని గంటల పాటు రోడ్లపై తిరిగి, టీ,టిఫిన్ సెంటర్ల వద్ద మకాం వేసి జనాల మధ్య ఉంటూ కనీసం మాస్కులు ధరించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వనస్దలిపురంలో ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఐదారుగురిని గుర్తించి బయటకు రావద్దని స్దానికులు హెచ్చరించారు. దీంతో వారు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు. గ్రేటర్‌లో 18,219మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు 29వేల మంది హోంక్వారంటైన్ ద్వారా చికిత్సలు పొంది 11వేలు కోలుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కేసులు ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలను కంటైన్‌మెంటు జోన్లు విభజించి నిబంధనలు కఠినంగా అమలు చేసిన రోగులు నిర్లక్ష వహిస్తున్నట్లు స్దానికులు ఆరోపిస్తున్నారు. గత ఆరునెలల నుంచి విరామం లేకుండా శ్రమిస్తే ప్రజలు ఆజాగ్రత్తగా ఉంటూ కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని జిల్లా వైద్యాధికారులు మండిపడుతున్నారు.హోంక్వారంటైన్ రోగులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు, ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినవారిని వెంటనే గుర్తించి ఆసుపత్రిలో చేరేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్దానిక ప్రజలు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News