Saturday, April 20, 2024

గడిచిన 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదు: లవ్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ:దేశంలో మొత్తం 979 కరోనా కేసుల నమోదయ్యాయని, ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19)పై హెల్త్ బులిటెన్ ను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో దేశంలో 106 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కరోనాతో మరణించారు.అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటున్నాం. ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యాలు పెంచాలి. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అవసరమైన మాస్క్ లు, వెంటిలేటర్లు దిగుమతి చేసుకున్నాం, ఆయూష్ విభాగం నిపుణులతో ప్రధాన మంత్రి మాట్లాడారు. ఏ సంస్థ కూడా ఉద్యోగులు, కార్మికులను తొలగించొద్దు. కరోనా చికిత్సలో పాల్గొంటున్న హెల్త్ కేర్ సిబ్బందికి ఇన్సురేన్స్ అందిస్తాం. ఇప్పటి వరకు 34,931 మంది అనుమానితుల నమూనాలను పరీక్షించాం. దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్య పెంచాం. ఆస్పత్రుల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేసే ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నివారణ చర్యలపై మార్గదర్శకాల కోసం 10 బృందాలు ఏర్పాటు చేశాం. రైల్వేశాఖ సహకారంతో గూడ్స్‌ రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, బొగ్గు, పెట్రోలియం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Corona Positive Cases raised to 979 in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News